Best Telugu Movies On Love - 2
Maro Charitra (1978)
Balachandars Classic tale of love.
Maro Charithra is a film looking at the love story breaking linguistuc barriers. A Tamil man, Balu (Kamal Haasan) loves a Telugu woman, Swapna (Saritha). Their families, against the affair, ask the two not to see each other for a year. If they can fulfill this condition, then they can marry. The film was a huge success
Kamal Haasan and Saritha are neighbours in this film who fall in love . Both of them came from different regions.
" Dil Raju " is planning to remake this classic movie.
Brief Story :
The movie is about the love between a Tamil man, Vasu (Kamal Haasan) and a North-Indian woman, Swapna , who are neighbours. They come from totally different backgrounds, and can hardly speak each other's language. Their parents despise each other and there are regular skirmishes for various reasons. When Kamal and Saritha admit their love there is chaos in their homes and their parents totally reject the idea.
The movie ends tragically when they both commit suicide by jumping off a cliff.
Telugu Lo :
గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు.
అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన మరో చరిత్ర సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు.
సంగీత సాహిత్యాల పరంగా ఎమ్.ఎస్.విశ్వనాధన్ బాణీలకు ఆత్రేయ రాసిన పాటలు ఇప్పటికీ జనంనోళ్ళలో నానుతున్నవే. “ఏ తీగపువ్వువో” పాట వినబడని కాంపిటీషన్ వుండదు.అందులో “తెలిసీ తెలియని అభిమానమౌనో..మనసు మూగది మాటలు రానిది” అంటూ కన్నెమనసులోని ప్రేమను ఆవిష్కరించి విధానం నభూతోనభవిష్యతి. అలాగే, “పదహారేళ్ళకూ నీలోనాలో ఈ ప్రాయంచేసే చిలిపి పనులకూ కోటిదండాలూ..శతకోటి దండాలు” అంటూ, చిలిపివయసు అనుభూతులకు ఉచితాసనంవేసి పట్టంకట్టిన పాటలో తెలుగులో మరోటి లేదు. “భలెభలే మగాడివోయ్ బంగారు నాసామిరో” అంటూ ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులోపలికిన భావాలూ ఆ పాటకు సరితచూపిన నటనా, అంతసులువుగా ఎవరైనా మరువగలమా! “కలసి వుంటే కలదు సుఖము” అంటూ తెలుగు సినిమా పెర్లన్నీకుట్టి ఒక సంగీతమాలని చెయ్యటం మరొ అత్యద్భుతమైన ప్రయోగం.
పాటలు
చక్కని పాటలు, బాలచందర్ దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్, భీమిలి, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇందులో పాటలు కలకాలం నిలిచిపోయి :
ఇతర విశేషాలు :
- ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరంపాటు నడచింది.
- 1981లో ఇదే సినిమాను ఎల్.వి.ప్రసాద్ హిందీలో "ఏక్ దూజె కే లియె" అన్న పేరుతో పునర్నిర్మించాడు. హిందీలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు పాడాడు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ("తేరె మేరె బీచ్ మె, కైసా హై యె బంధన్ అన్‌జానా", "హమ్ బనె తుమ్ బనె ఏక్ దూజె కెలియె" వగైరా)
- తెలుగు, హిందీ సినిమాలు కూడా హైదరాబాదులో 365రోజులు ఆడాయి
- ఈ క్లాసిక్ సినిమాను దిల్’రాజు, తన నిర్మాణ సారధ్యంలో పునర్నిర్మించే ఆలోచనలో వున్నట్లు పరిశ్రమవర్గాల వినికిడి.
You can get Maro Charithra songs from HERE
Source: Various websites
Labels: Filmy